చిత్రం చెప్పే విశేషాలు

(13-02-2024/2)

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మానుషి చిల్లర్‌ కథానాయిక. ఇందులో రుహానీ శర్మ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, నాయకులు మేడిగడ్డను సందర్శించారు. బ్యారేజీని పరిశీలించి అధికారులను పలు వివరాలు అడిగారు.

వరల్డ్‌ ఫొటోగ్రఫీ ఆర్గనైజేషన్‌, సోనీ సంయుక్తంగా సోనీ వరల్డ్‌ ఫొటోగ్రఫీ అవార్డులు, 2024ను ప్రకటించాయి. మన దేశానికి చెందిన మితుల్‌ కజారియా తీసిన చిత్రం కూడా అవార్డుకు ఎంపికైంది.

నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. సభకు భారీగా భారాస శ్రేణులు తరలివచ్చాయి.

 సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. అనంతరం రైతుల కోసం పోరాడతామని పేర్కొన్నారు. 

ఈనెల 16న తిరుమలలో జరగనున్న అర్ధ బ్రహ్మోత్సవానికి తితిదే విస్త్రృతంగా ఏర్పాట్లు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. 


ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అబుదాబిలో భారతీయ సమాజ సభ్యులతో సమావేశమయ్యారు. సంబంధిత చిత్రాలను ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. 

ఏమిటీ ‘నీట్‌’ వివాదం?

చిత్రం చెప్పే విశేషాలు (19-06-2024)

యమ్మీ.. యమ్మీ.. ఛీజ్‌ కేక్‌

Eenadu.net Home