చిత్రం చెప్పే విశేషాలు

(15-02-2024/3)

గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి మనవడి వివాహానికి ముఖ్యమంత్రి జగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించారు.  

‘మా సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ నిర్మాణానికి తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ విరాళం అందించారు. ఈ మేరకు ఉదయనిధి స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నటుడు విశాల్‌ సంబంధిత ఫొటోలను ఎక్స్‌(ట్విటర్‌) ద్వారా పంచుకున్నారు.  

తెలంగాణ భవన్‌లో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్‌, కవిత, భారాస నాయకులు, గిరిజన మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

 ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారికి కుశల్‌ కృష్ణ అని నామకరణం చేశారు.  

 ఖతార్‌ దేశ పాలకుడు షేక్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌థానీతో గురువారం ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల కోసం చర్చించారు. 

బంజారాహిల్స్‌లో ‘సింఘానియా ఫ్యాషన్‌ షో-2024’ ప్రారంభించారు. బిగ్‌బాస్‌ ఫేమ్ శుభ శ్రీ, మోడల్స్‌ హాజరై ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. 

పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ పొలంలో రైతు భూసారాన్ని పెంచడం కోసం ఇలా కత్తి జనుమ మొక్కలను నాటాడు. చుట్టూ కొండలు ఉండటంతో బాటసారులను అబ్బురపరుస్తోంది.  

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home