చిత్రం చెప్పే విశేషాలు

(16-02-2024/2)

తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం నిర్వహించారు. మూడు రోజుల పాటు ఇది కొనసాగనుంది. పూజలో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. 

భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. 326/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 445 పరుగులు చేసి ఆలౌటైంది. తరువాత తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్ 207/2 పరుగులు చేసింది.

భారాసలోని ముఖ్య నేతలు.. కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప్‌దాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం నేతలంతా అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. 

ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం దేవర. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 

రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’లో రాష్ట్రీయ జనతాదళ్‌ నేత తేజస్వీ యాదవ్‌ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌తో కలిసి తేజస్వీ స్వయంగా డ్రైవింగ్‌ చేసి పార్టీల కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.

 క్రికెట్‌ దిగ్గజం సచిన్‌.. ఆయన భార్య అంజలితో కలిసి తాజ్‌మహల్‌ వద్దకు వెళ్లారు. సంబంధిత చిత్రాలను ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. 

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ దిల్లీ చలో కార్యక్రమం చేపట్టిన రైతు సంఘాల ఆందోళనలు శుక్రవారం కొనసాగాయి. హరియాణా సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేశారు.

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home