చిత్రం చెప్పే విశేషాలు

(17-02-2024/2)

మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌ కలిసి ఓ పెళ్లిలో సందడి చేశారు. సంబంధిత ఫొటోలను చిరంజీవి సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో తెదేపా ‘శంఖారావం’ బహిరంగ సభ నిర్వహించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరై ప్రసంగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఫొటోను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ధాన్యాధివాసం నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న మల్లేశ్వరస్వామి వారి పూజా కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజైన శనివారం ప్రత్యేక పూజలు చేశారు.

నటుడు యశ్‌.. తన భార్య, కూతురు ఐస్‌క్యాండీ అడిగారని చిన్న కిరాణా దుకాణానికి తీసుకెళ్లి మరీ కొనిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతున్నాయి.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఆత్మకూరులోని చేనేత పరిశ్రమ, డైయింగ్ షెడ్‌ను ఆమె పరిశీలించారు.

రాహుల్‌ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో భాగంగా వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా 'సర్వ్ సేవా సంఘ్' ముందు ఆగి ప్రజలతో మాట్లాడారు. 

చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. 

చిత్రం చెప్పే విశేషాలు (21-04-2024/1)

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

Eenadu.net Home