చిత్రం చెప్పే విశేషాలు

(18-02-2024/2)

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో శనివారం షర్మిల తనయుడి వివాహం జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన వేడుకకు వైఎస్‌ విజయమ్మతో సహా సన్నిహితులు హాజరయ్యారు.

మెగా డీఎస్సీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‍ చేస్తూ గాజువాకలోని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఇంటిని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ముట్టడించారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వయనాడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పులుల దాడిలో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించారు. 

 హీరో చిరంజీవి.. ఆయన భార్య సురేఖ పుట్టినరోజుని పురస్కరించుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టి, శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ. హ్యపీ బర్త్‌డే’’ అంటూ స్పెషల్‌గా విష్‌ చేశారు.

విశాఖలో తెదేపా ‘శంఖారావం’ సభను ఘనంగా నిర్వహించారు. నారా లోకేశ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. 

నానక్‌రాంగూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు.

అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైకాపా ఆదివారం నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభ కోసం ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా 3వేల బస్సులను కేటాయించింది. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 557 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 434 పరుగుల భారీ తేడాతో టీమ్‌ఇండియా విజయకేతనం ఎగురవేసింది.

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

చిత్రం చెప్పే విశేషాలు (20-04-2024/1)

Eenadu.net Home