చిత్రం చెప్పే విశేషాలు

(18-02-2024/3)

భారత్-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ జైస్వాల్‌ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. 

ఫ్రాన్స్‌లో కార్నివాల్‌ క్వీన్‌ పరేడ్‌ను అట్టహాసంగా నిర్వహించారు. వివిధ రకాల బొమ్మలు, శకటాలను ప్రదర్శించారు. అక్కడి ప్రజలు భారీ సంఖ్యలో కార్నివాల్‌ పరేడ్‌లో పాల్గొని సందడి చేశారు.

బంజారాహిల్స్‌లో ఆసియా జువెల్స్‌ షో ఘనంగా ప్రారంభించారు. ఈవెంట్‌లో సినీ నటీమణులు స్రవంతి చొక్కారపు, ఊర్మిళా చౌహాన్‌(మిస్‌ ఇండియా తెలంగాణ-2023), ఫ్యాషన్ ప్రియులు హాజరై సందడి చేశారు.

సింహాద్రి అప్పన్న స్వామిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

 సినీనటి ఆషికా రంగనాథ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

 మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో మధ్వనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో పుస్తక ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం అధిక సంఖ్యలో నగరవాసులు పుస్తక ప్రదర్శనకు వచ్చారు. పుస్తక ప్రియులు వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు.

 కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.  

జిమ్‌.. జామ్‌..

చిత్రం చెప్పే విశేషాలు..(21-04-2024)

హైదరాబాద్‌ ఆటగాళ్ల సంబరాలు చూశారా!

Eenadu.net Home