చిత్రం చెప్పే విశేషాలు

(19-02-2024/1)

శ్రీవారి దర్శనార్థం సినీనటి శ్రీలీల ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన స్థానిక జీఎంఆర్‌ ఆతిథి గృహం వద్దకు చేరుకున్నారు. భారీగా అభిమానులు అతిథిగృహం వద్దకు చేరుకోవడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని నిలువరించారు. 

 అడ్డతీగల కార్పెంటర్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న పల్లాల లక్ష్మి ఇంట్లో పెంచుకుంటున్న నాటు కోడి ఆదివారం పిల్లలు ఆడుకునే గోళి పరిమాణంలో అతిచిన్న గుడ్డు పెట్టింది. సాధారణంగా కోడిగుడ్లు 40 నుంచి 50 గ్రాముల బరువు ఉంటాయి. దానికి భిన్నంగా 10 గ్రాముల బరువుతో ఉంది.

తాటిచెట్టు ఎక్కాలంటే కష్టంగా ఉంటుంది. అలవాటు ఉన్నవారికే ఆ పని సాధ్యం. లేకుంటే ప్రాణానికే ప్రమాదం. మణుగూరు మండలం బుగ్గ, కంభంతోగు గ్రామాల పరిధిలో సుమారు 150 తాటిచెట్లకు వెదురు కర్రలను అమర్చి ఎక్కుతున్నారు. అన్ని చెట్లకు చెట్టు ఎత్తు ఉన్న వెదురు కర్రను అమర్చుతారు. 

ఇది మామిడి చెట్టుకు చేనేత చీమలు నిర్మించిన గూడు. ఇవి చెట్ల మీద లార్వా(సిల్క్‌)ని ఉపయోగించి లేత ఆకులను నేయడం ద్వారా గూళ్లను నిర్మించుకోవడం వీటి ప్రత్యేకత. ప్రస్తుతం మామిడి చెట్లు పూతతో నిండిపోతాయి. ఈ చేనేత చీమలు కీటకాలను వేటాడి గూళ్లలో ఉన్న తమ పిల్లలకు ఆహారంగా అందిస్తాయి. 

వేసవి రాక ముందే భానుడు చెలరేగుతుండటంతో తిరునగరిలో జనాలు అల్లాడిపోతున్నారు. తిరుపతి ఇందిరప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌లో ఎండ తీవ్రతకు కూరగాయలు దెబ్బతినకుండా.. కొనుగోలుదారులు ఎండలో ఉండకుండా వ్యాపారులు గొడుగులు ఏర్పాటు చేయడంతో మార్కెట్‌ గొడుగులమయమైంది. 

పరిసరాలన్నీ పంటలు, మొక్కలు, చెట్ల పచ్చదనంతో వెల్లివిరియగా.. ఔషధ గుణమున్న వేప చెట్టు మాత్రం తెగులు బారిన పడి బోసిపోయి కనిపిస్తోంది. సంగారెడ్డి సమీపంలో చుట్టుపక్కల వేప చెట్లన్నీ ఇలాగే ఎండిపోయి ఉన్నాయి. గతేడాది ఇలాగే వేపకు తెగులు తగిలి తర్వాత మామూలు స్థితికి వచ్చాయి.

ఓ మహిళ హైటెక్‌ సిటీ క్రాస్‌ రోడ్డులో ఇలా బుడగలు అమ్ముకుంటూ కనిపించింది. తన చిన్నారిని ఇలా వస్త్రంతో నడుముకు కట్టేసుకుని ఎండలో తిరుగుతోంది. తన రెండు చేతుల్లో ఉన్న బుడగలను విక్రయిస్తూనే బిడ్డకు ఎండ తగలకుండా వాటిని గొడుగులా పట్టుకుని తిరగడం ఆకట్టుకుంది

వీధుల్లో తిరుగుతూ బొమ్మలు అమ్ముకునే కుటుంబం వీరిది. ఖైరతాబాద్‌లో ఉండే వీరు నిత్యం తాగునీటి కోసం ఎక్కడో దూరం వెళ్లాల్సి వస్తోంది. మోసుకుంటూ రావడం కష్టం కావడంతో ఓ బుడ్డోడు ఇలా చక్రాల బండిపై నీటి క్యాన్‌ ఉంచి తాడుతో లాగుతూ తీసుకెళ్తూ కనిపించాడు. 

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖలో ఈ నెల 19వ తేదీ (సోమవారం) నుంచి బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా విశాఖ బీచ్‌లో ఆదివారం నేవి సిబ్బంది ప్రదర్శించిన సన్నాహక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home