చిత్రం చెప్పే విశేషాలు

(19-02-2024/2)

లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో 77వ BAFTA అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ (BAFTA) అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె ప్రజెంటర్‌గా వ్యవహరించారు. 

తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన రోబో ట్రాక్‌ కార్యక్రమంలో వివిధ ప్రాంత విద్యార్థులు పాల్గొన్నారు. తమ ఆవిష్కరణలతో నిర్వాహకులను మెప్పించి బహుమతులు అందుకున్నారు. 

ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు సాయి శ్రేయస్‌. వయసు 18 నెలలు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌(ఐబీఓఆర్‌)లో చోటు సాధించాడు. నాలుగు లీటర్ల నీటి సీసాను చేతులతో ఎత్తి ఈ ఘనత సాధించాడు. శనివారం ఐబీఓఆర్‌ నుంచి పతకం, ప్రశంసా పత్రం అందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. 

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఆర్ట్‌ ఫెస్ట్‌ కళాప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వివిధ నగరాలకు చెందిన 300 చిత్రకారులు గీసిన అందమైన చిత్తరువులతో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన చూపరులకు కనువిందు చేస్తోంది.

హెల్మెట్‌ ధరించాలని ట్రాఫిక్‌ పోలీసులు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నా కొందరు ద్విచక్ర వాహనదారుల్లో మార్పు రావడం లేదు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఐటీ కారిడార్‌లో నిత్యం కనిపిస్తున్న చిత్రాలివి.

మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌ నగరవాసి దీపేంద్ర రాఠోడ్‌ (29). ఈ-రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే వాహనానికి ‘పెళ్లికుమార్తె కావలెను’ అంటూ ఓ హోర్డింగుపై  దీపేంద్ర ఫొటోతోపాటు ఎత్తు, పుట్టినతేదీ, బ్లడ్‌ గ్రూపు, విద్యార్హతలు, గోత్రం వంటి వివరాలన్నీ కట్టుకుని నగరమంతా తిరుగుతున్నాడు.

అల్లవరానికి చెందిన మత్స్యకారుడు అంగాని శ్రీను చేతికి సుమారు కేజిన్నర బరువుండే పస పీత వైనతేయ గోదావరిలో ఆదివారం దొరికింది. వీటిని ఎక్కువగా చెరువుల్లో ట్రేలు ఏర్పాటు చేసి పెంచుతారు. ఈ రకం పీతలకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది

శాయంపేటలో కోతుల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానరాలు గుంపులుగా తిరుగుతూ వీధుల్లో తిరిగే వారిపై దాడి చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి అందిన వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. ప్రత్యేకాధికారులు చొరవ తీసుకొని కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

ఆదోని మండలం పెద్దహరివాణం జడ్పీ పాఠశాల విద్యార్థి కుమారస్వామి పర్యావరణహిత, విద్యుత్తు రహిత, పేదలకు ఉపయోగపడేలా, తక్కువ ఖర్చుతో ఫ్రిజ్‌ రూపొందించాడు. ఆహార పదార్థాలతో పాటు, కూరగాయలు, పండ్లు, ఔషధాలు సహజ పద్ధతిలో నిల్వ చేసుకోవచ్చని విద్యార్థి తెలిపాడు. 

జిమ్‌.. జామ్‌..

చిత్రం చెప్పే విశేషాలు..(21-04-2024)

హైదరాబాద్‌ ఆటగాళ్ల సంబరాలు చూశారా!

Eenadu.net Home