చిత్రం చెప్పే విశేషాలు

(19-02-2024/3)

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో ప్రధాని మోదీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు.

ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌ రావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

కూకట్‌పల్లి వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో సారంగ్ 2కే- 24 కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్యాన్సులతో అలరించారు.

తిరుమల శ్రీవారిని సినీనటి శ్రీలీల దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సీఎం రేవంత్‌రెడ్డిని.. చిన జీయర్‌స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామానుజాచార్య-108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌ను ఆహ్వానించారు. 

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి- ప్రియల వివాహ వేడుక ఫిబ్రవరి 17న రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో ఘనంగా జరిగింది. తాజాగా ఆ ఫొటోలను షర్మిల ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు.

విశాఖలో తెదేపా ‘శంఖారావం’ సభను ఘనంగా నిర్వహించారు. నారా లోకేశ్‌ హాజరై ప్రసంగించారు. సభలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

హీరో ధనుష్‌ నటిస్తోన్న 50వ సినిమా ఫస్ట్‌లుక్‌, పేరుని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఆ ల్యాండ్‌మార్క్‌ చిత్రానికి ‘రాయన్‌’ టైటిల్‌ పెట్టినట్లు తెలియజేశారు.

చిత్రం చెప్పే విశేషాలు(05-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(05-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(04-07-2025)

Eenadu.net Home