చిత్రం చెప్పే విశేషాలు

(22-02-2024/2)

సినీనటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ బుధవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సినీ నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలోని ఓ రిసార్ట్స్‌లో వివాహ వేడుక ఘనంగా జరిగింది. కొత్త జంటకు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం మేడారం చేరుకుని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించారు.

యాదాద్రి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి హనుమ వాహన సేవ నిర్వహించారు.

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లిలో భాజపా విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఈటల రాజేందర్‌ పాల్గొని ప్రసంగించారు.

వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్‌తేజ్ మిలిటరీ మాధవరం గ్రామాన్ని సందర్శించారు. అక్కడి అమర జవాన్‌ స్తూపానికి నివాళి అర్పించారు. మాజీ సైనికులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు.

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ జమ్మూకశ్మీర్‌ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ సరదాగా క్రికెట్‌ ఆడుతున్న వీడియోలను ఆయన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకున్నారు.

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

గాజా స్ట్రిప్‌లోని రఫా నగరంలో ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా భవనాలు ధ్వంసమయ్యాయి. కొంతకాలంగా ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా పాలస్తీనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

చిత్రం చెప్పే విశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(11-01-2025)

Eenadu.net Home