చిత్రం చెప్పే విశేషాలు

(23-02-2024/2)

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. తన ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించారు. అంతకు ముందు మంత్రి సీతక్క ఆమెకు స్వాగతం పలికారు.

కుమురంభీం జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్‌లో భాజపా విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి మంచులో దిగిన ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. పహల్గామ్‌లో పహ్‌లా(మొదటి) స్నో ఫాల్‌ అని సచిన్‌ ఫన్నీగా పోస్టు పెట్టారు.

రాంచిలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత క్రికెటర్‌ ఆకాశ్‌ దీప్‌ అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, భారత జట్టు సభ్యులు ఆయనకు క్యాప్‌ను అందించి అభినందనలు తెలిపారు.

శుభ్‌మన్‌ గిల్‌ నోట్స్‌ రాస్తున్న ఫొటోను ‘గుజరాత్‌ టైటాన్స్‌’ తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో పంచుకుంది. మా టాపర్‌ ప్రిపరేషన్‌ మొదలుపెట్టాడు అని ఫన్నీగా పోస్టు పెట్టింది.

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో సంత్‌ రవిదాస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నారు.

‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ఆర్‌ పురం మండలం గంగమ్మగుడి గ్రామంలో పర్యటించారు. గతంలో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన తెదేపా కార్యకర్త కరణం ఆంజనేయ నాయుడు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

చిత్రం చెప్పే విశేషాలు (12-04-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు(12-04-2024/1)

నానో న్యూస్‌ (12/ 04/ 2024)

Eenadu.net Home