చిత్రం చెప్పే విశేషాలు

(24-02-2024/2)

రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మోరాబాద్‌ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా వారు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ముంబయి లోకల్ రైలులో ఘట్‌కోపర్ నుంచి కళ్యాణ్‌కు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణికులతో మాట్లాడి వివిధ అంశాలపై ఆరా తీశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తుళ్లూరులోని వీఐటీ విశ్వవిద్యాలయంలో విటోపియా-2024 వార్షిక క్రీడలు, సాంస్కృతిక ఉత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా, శనివారం మాఘ పూర్ణిమ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు సముద్ర స్నానాలు చేశారు.

వేలమంది సైనికులు పిట్టల్లా రాలిపోయారు. ఆయుధ, మందుగుండు నిల్వలు కొవ్వొత్తుల్లా కరిగిపోయాయి. అమాయక ప్రజలు అనేకులు అసువులు బాశారు. అయినా ఆ విధ్వంసకాండకు ఇంకా తెరపడలేదు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. శనివారంతో రెండేళ్లు పూర్తిచేసుకొని మూడో ఏడులోకి అడుగుపెడుతోంది.

తిరుపతి ఆవిర్భావ వేడుకలను తితిదే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ వీధుల్లో మహిళలు, ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ఏటా ‘తిరుపతి పండగ’ను క్రమం తప్పకుండా నిర్వహించాలని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, అధికారులు అన్నారు.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆసియా జువెల్స్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌ మూడు రోజుల పాటు జరగనుంది. కార్యక్రమానికి సినీనటి అషూ రెడ్డి, మోడల్స్‌ హాజరై సందడి చేశారు.

చిత్రం చెప్పే విశేషాలు (21-04-2024/1)

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

Eenadu.net Home