చిత్రం చెప్పే విశేషాలు
(25-02-2024/1)
జూబ్లీహిల్స్‌లో నూతనంగా ప్రారంభించిన ఓ డైమండ్ స్టోర్‌లో సినీనటి మంజుల ఘట్టమనేని, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డితో పాటు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం పలు డిజైనర్ ఆభరణాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు.
దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ఈ రోజు ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్ ద్వారకాతో అనుసంధానిస్తుంది. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియ రిసెప్షన్ హైదరాబాద్ శంషాబాద్‌లోని పోర్ట్ గ్రాండ్‌లో శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఏపీ వ్యాప్తంగా గ్రూపు-2 ఉద్యోగ నియామకాల కోసం ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ఈ పరీక్ష రాసేందుకు ఏర్పాటు చేసిన 1,327 కేంద్రాలకు అభ్యర్థులు అధిక సంఖ్యలో చేరుకుని పరీక్ష రాశారు.
యువతులు, మహిళలు ర్యాంపుపై హొయలొలి కించగా.. తామేమి తక్కువ కాదంటూ చిన్నారులు మెరిసిపోయారు. కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్‌లో శనివారం జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో చిన్నా పెద్దా ర్యాంపువాక్‌తో అలరించారు.
విశాఖపట్నం జిల్లా చెరువులవెనంలో కురుస్తున్న మంచు అందాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో పర్యటకులు తరలివస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.
కొద్దిరోజులుగా నగరంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం పొగ మంచు.. మధ్యాహ్నం ఎండలు మండిపోతున్నాయి. బైరామల్‌గూడ కూడలిలో శనివారం ఉదయం 8.30గంటలకు కమ్మేసిన పొగమంచును ఈ చిత్రంలో చూడొచ్చు.
మేడ్చల్ రూరల్, న్యూస్‌టుడే: మేడ్చల్ పట్టణం నుంచి రైల్వే కాలనీ వెళ్లే దారిలో వృక్షాలు కనివిందు చేస్తున్నాయి. పచ్చని చెట్లతో వచ్చే గాలితో ప్రయాణం హాయిగా ఉంటోంది.