చిత్రం చెప్పే విశేషాలు
(26-02-2024/2)
దేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్స్-2024 ఈవెంట్‌ను దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 100 దేశాల నుంచి ఎగ్జిబిటర్లు, కొనుగోలుదారులు, 40 వేల మంది వాణిజ్య సందర్శకులు హాజరయ్యారు.
వైకాపా నాయకులు పార్థసారథి, బొప్పన భవకుమార్ తెదేపాలో చేరేందుకు విజయవాడ పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో పెద్దఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలక పరుగులు చేసిన ధ్రువ్ జురెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్టికల్ 370’. కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తాజాగా గల్ఫ్ దేశాలన్నీ ఈ సినిమాపై నిషేధం విధించాయి.
బేగంపేట రైల్వేస్టేషన్ ఆధునికీకరణ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.
సుప్రసిద్ధ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ (72) కన్నుమూశారు. ఆయన మృతికి ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రారంభించిన ఒక్క రోజులోనే విశాఖలో నీటిపై తేలే వంతెన తెగిపోయింది. చివరి భాగం విడిపోయి కొద్దిదూరం కొట్టుకుపోయింది.
వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం తెదేపాలో చేరారు. విజయవాడలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.