చిత్రం చెప్పే విశేషాలు

(27-02-2024/1)

సారవకోట మండలం కిడిమి గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక, పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అరటి గెలలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.  

విజయవాడ ఆర్టీసీ బస్టాండు వద్ద ఈ చిత్రం కనిపించింది. విజయవాడ నుంచి గుంటూరువైపు పట్టాలపై వెళ్తున్న గూడ్సురైలు రైలుపట్టాలను తీసుకువెళ్తూ చూపరులకు కనువిందు చేసింది.

ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాయన్‌’. ఈ చిత్రం నుంచి తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఫస్ట్‌లుక్‌ను పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న కొద్దిపాటి నీటిని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నిల్వచేస్తున్నారు. దీంతో నిత్యం గలగలమంటూ పారుతూ ఉండే జీవనదిలో ఇసుక తిన్నెలు ఇలా దర్శనమిస్తున్నాయి.

ఉండ్రాజవరంలోని ఓ గ్రామంలో ఆస్ట్రేలియా నుంచి తీసుకువచ్చిన ఉసిరి మొక్క గుత్తులు గుత్తులుగా విరగకాస్తుంది. దొండ ఆకృతిలో ఉండి చూపరులను ఆకర్షిస్తోంది. 

నటి రాశీఖన్నా సోమవారం బంజారాహిల్స్‌ తాజ్‌కృష్ణలో ‘యోధ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సందడి చేశారు. ఈ సినిమాలో తాను తెలుగమ్మాయిగా నటించినట్లు పేర్కొన్నారు. 

అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగంపేట రైల్వేస్టేషన్‌ వద్ద ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. వైష్ణవి చైతన్య హీరోయిన్‌. తాజాగా ఈ చిత్రానికి ‘లవ్‌ మీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.

జొన్నరొట్టె కావాలా నాయనా..?

స్టెప్పులేసిన ‘వయ్యారి’ భామ

చిత్రం చెప్పే విశేషాలు (12-04-2024/2)

Eenadu.net Home