చిత్రం చెప్పే విశేషాలు

(27-02-2024/2)

హైదరాబాద్‌లో 21వ బయో ఆసియా - 2024 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సదస్సులో పాల్గొన్నారు.

 భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. వారిని పరిచయం చేస్తూ.. స్టాండింగ్ ఒవేషన్‌తో సత్కరించారు.

ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాయన్‌’. ధనుష్‌ సరసన అపర్ణ బాలమురళీ నటించనున్నారు. తాజాగా ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రంబృందం పంచుకుంది. 

భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మోకాలికి జరిగిన సర్జరీ విజయవంతమైందని వెల్లడించారు. ఈ సందర్భంగా షమీ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. 

డాక్టర్‌ బీ ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఓ రిసార్ట్‌లో విక్టోరియా అమజోనికా వాటర్‌ లిల్లీ ఆకులు కనువిందు చేశాయి. ఇవి అతిపెద్ద వాటర్‌ లిల్లీ పూలు. 

విశాఖపట్నంలో ‘భారత్‌ రైజింగ్‌’ ఎలైట్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, నాయకులు హాజరయ్యారు.

పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను రాష్ట్ర సచివాలయంలో రేవంత్‌ ప్రారంభించారు.

ఒంగోలు నగరంలోని శ్రీగిరి కొండపై ఉన్న టవర్‌ మీద సూర్యుడు ఉన్నట్లుగా కనిపిస్తున్న చిత్రం ఆకట్టుకుంది. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో కనిపించిందీ దృశ్యం.

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home