చిత్రం చెప్పే విశేషాలు

(29-02-2024/1)

హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె వివాహ మహోత్సవానికి సీఎం రేవంత్‌ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.

మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు గురువారం ప్రారంభమైంది. హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో దీనికోసం ఏర్పాట్లు చేశారు. 518 హుండీలను 10 రోజులపాటు లెక్కించనున్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర అనకాపల్లిలో కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాల్ని ఆమె పరామర్శించి, చెక్కులు అందజేశారు.

మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ గురువారం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. తాను తెదేపాలోనే కొనసాగుతానని ఈ సందర్భంగా జలీల్‌ఖాన్‌ స్పష్టం చేశారు.

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో ఫేమస్‌ అయిన డాలీ చాయ్‌వాలా వద్దకు వెళ్లి చాయ్‌ను టేస్ట్‌ చేశారు.  

తెదేపా-జనసేన కలిసి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన ‘జెండా’ సభలో సభా వేదికపైకి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చేరుకున్నారు. ఇరుపార్టీల జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. 

వారణాసి నగరాన్ని సందర్శించారు నేహాశెట్టి. పడవ ప్రయాణంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

కర్ణాటకలోని బల్లారిలో శ్రీ అమృతేశ్వరాలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.  

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

చిత్రం చెప్పే విశేషాలు (20-04-2024/1)

Eenadu.net Home