చిత్రం చెప్పే విశేషాలు

(29-02-2024/2)

నిజామాబాద్‌ జిల్లాలో భాజపా ‘విజయ సంకల్ప’ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హాజరై ప్రసంగించారు.

విశాఖనగరంలోని రుషికొండపై నిర్మించిన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 9.2 ఎకరాల్లో ఈ నిర్మాణాలు జరిగాయి. 

 శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘స్వాగ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు శ్రీ విష్ణు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది.  

మంత్రి రాజ నర్సింహ కుమార్తె వివాహం హైదరాబాద్‌లో జరిగింది. గవర్నర్‌ తమిళి సై, మాజీ మంత్రి కేటీఆర్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

‘గురు’ ఫేమ్ రితికా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’. ఓటీటీ వేదికగా ఈటీవీ విన్‌లో మార్చి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. 

భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి ఆలయ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వర్ణగిరి యాదాద్రి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించనున్నారు.

ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. గుజరాత్‌లోని జోగ్వాడ్‌ గ్రామంలో ‘అన్న సేవ’ నిర్వహించారు. అంబానీ కుటుంబ సభ్యులు, కాబోయే పెళ్లికుమార్తె రాధికా మర్చంట్‌ స్వయంగా భోజనం వడ్డించారు.  

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో గార్డెన్స్‌లో పచ్చదనం సంచరించుకొని ఆహ్లాదాన్ని పంచుతోంది. దీంతో చుట్టూ చెట్ల మధ్య ఫౌంటెన్ వద్ద సందర్శకులు సందడి చేస్తున్నారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home