చిత్రం చెప్పే విశేషాలు

(01-03-2024/2)

అమెరికాలోని టెక్సాస్‌ పాన్‌హ్యాండిల్‌ వద్ద కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల ఎకరాల చెట్లు, పొలాలు, గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నికీలలు ఉపగ్రహం చిత్రాల్లో ఇలా కనిపించాయి.

శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ మురళీ కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి అనకాపల్లిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేశారు.

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌లో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. ముషీరాబాద్ చౌరస్తా నుంచి కవాడిగూడ గాంధీనగర్ రాంనగర్ ప్రాంతాల మీదుగా ఈ యాత్ర కొనసాగింది.

ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి టోనీ అబాట్‌ ముఖ్య అతిథిగా ఎల్‌పీయూ 11వ వార్షిక స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. టోనీ అబాట్‌కు ఎల్‌పీయూ ఆధ్వర్యంలో డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.

2022లో ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కనుంది. ఇందులో తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ కాశీలో ప్రారంభమైంది.  

గవర్నర్‌ తమిళి సై తమిళనాడులోని ఆదిపరాశక్తి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

భారాస ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పలువురు నేతలు శుక్రవారం మేడిగడ్డకు చేరుకొని ప్రాజెక్టును పరిశీలించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

చిత్రం చెప్పే విశేషాలు (20-04-2024/1)

Eenadu.net Home