చిత్రం చెప్పే విశేషాలు
(02-03-2024/2)
చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. చంద్రాబాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు యోగనరసింహుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
బంజారాహిల్స్‌లో ‘పాప్-అప్’ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల దుస్తులు, కళాకృతులు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. నగరవాసులు ఉత్సాహంగా హాజరయ్యారు.
ఈ నెల 3న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోలియోపై అవగాహన కలిగిస్తూ పలు జిల్లాల్లో ర్యాలీలు చేపట్టారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత జోడో న్యాయ యాత్ర’లో భాగంగా రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తతో శుక్రవారం వరలక్ష్మి నిశ్చితార్థం జరిగింది. ఆ ఫొటోలను తాజాగా పంచుకున్నారు.
తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ మూవీ 150 థియేటర్‌లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర బృందం ‘హిస్టారికల్ 50 డేస్’ కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో హుండీని శనివారం లెక్కించారు. 32 రోజులకుగానూ నగదు రూ. 4,65,65,102 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.