చిత్రం చెప్పే విశేషాలు

(03-03-2024/2)

అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ ముగ్గురు కలిసి చిందేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు ఆదివారం పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ఓ చిన్నారికి ఇలా పోలియో చుక్కలు వేశారు. 

బంజారాహిల్స్‌లోని ఓ నగల దుకాణాన్ని సినీనటి రాశీసింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చారు. 

ఇటీవల రాజేంద్రనగర్ మిలీనియం పాఠశాల విద్యార్థులు ‘ఎక్స్‌’ వేదికగా తమ పాఠశాల వార్షికోత్సవానికి రావాలని కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం కేటీఆర్‌ ఆ పాఠశాలకు వెళ్లి కార్యక్రమానికి హాజరయ్యారు.

చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు

నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో 11 వేల మంది విద్యార్థినులు, మహిళలు తైక్వాండో ప్రదర్శన చేశారు. దీంతో ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో చోటు సంపాదించారు. 

భారాస అధినేత కేసీఆర్‌ కరీంనగర్‌, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు. 

చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. త్వరలో జనసేనలో చేరనున్నట్టు సమాచారం.

చిత్రం చెప్పే విశేషాలు (12-04-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు(12-04-2024/1)

నానో న్యూస్‌ (12/ 04/ 2024)

Eenadu.net Home