చిత్రం చెప్పే విశేషాలు

(04-03-2024/2)

 కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాహుల్‌ పలువురిని ఆప్యాయంగా పలకరించారు. 

 సినీనటి సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.  

నటి తమన్నా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 19 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నటి కాజల్ శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు ఎడిట్‌ చేసిన తమన్నా పోస్టర్లను షేర్‌ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. 

అమెరికాలోని కాలిఫోర్నియాలో మంచు బీభత్సం సృష్టిస్తోంది. చలి గాలులు, మంచు తీవ్రతతో ఆ ప్రాంతమంతా పూర్తిగా గడ్డ కట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

సినీనటుడు విశాల్‌ పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సంబంధిత చిత్రాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. 

శ్రీశైలం మల్లికార్జున స్వామివారి పుణ్యక్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 

 హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా వ్యర్థాలు పడేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చెత్తను తొలగించి ఇలా చక్కటి పెయింటింగ్స్‌ వేశారు. 

చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

అనంతపురం జిల్లా పెనుకొండలో తెదేపా ‘రా.. కదలిరా’ బహిరంగ సభ నిర్వహించారు. చంద్రబాబు హాజరై ప్రసంగించారు. తెదేపా నాయకుడు నందమూరి బాలకృష్ణ, నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

బంజారాహిల్స్‌లో మార్చి 15 నుంచి హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించనున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌లో సినీ నటీమణులు అషు రెడ్డి, ప్రీతి కుమారి, ప్రియాంక చౌదరి, ఫ్యాషన్‌ ప్రియులు హాజరై సందడి చేశారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home