చిత్రం చెప్పే విశేషాలు

(05-03-2024/1)

తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

హైదరాబాద్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. వివిధ రకాల వస్తువులు, నగలు, హస్తకళలు, హోమ్‌నీడ్‌ పరికాలు ఆకట్టుకున్నాయి. మోడల్స్‌, ఫ్యాషన్‌ ప్రియులు హాజరై ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఉదయం సోమస్కంద మూర్తి సూర్యప్రభపై, జ్ఞానాంబిక అమ్మవారు చెప్పరంపై కొలువుదీరారు. 

తెలంగాణ పర్యటన ముగించుకుని వెళ్తున్న ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

 భారాస అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తును ప్రకటించాయి.

సినీనటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లి రాధిక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు చిత్రాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.  

కాలిఫోర్నియాను మంచు వణికిస్తోంది. విపరీతంగా మంచు కురవడంతో రవాణా, విద్యుత్తు సరఫరా నిలిచిపోయాయి. 

మండలంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

చిత్రం చెప్పే విశేషాలు (20-04-2024/1)

Eenadu.net Home