చిత్రం చెప్పే విశేషాలు

(05-03-2024/2)

శ్రీ‌నివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. 

సంగారెడ్డిలో భాజపాఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ పాలనను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాలేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. 

బంజారాహిల్స్‌లో కల్కి ఫ్యాషన్‌ స్టోర్‌ను ప్రారంభించారు. సినీనటి కాజల్‌ అగర్వాల్‌ హాజరై ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. మోడల్స్‌, ఫ్యాషన్ ప్రియులు నూతన వస్త్రాలతో ఫొటోలు దిగారు.

శివరాత్రి సమీపిస్తున్న తరుణంలో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాయి.

ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌లో లింగంపల్లి-ఘట్‌కేసర్‌ ఎమ్ఎమ్‌టీఎస్‌ రైలుని ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు. 

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను భారాస ఎమ్మెల్యే కాలె యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తోన్న చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం మీనాక్షి పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం పంచుకుంది. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home