చిత్రం చెప్పే విశేషాలు

(06-03-2024/1)

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం బీసీ కాలనీలోని రుద్రభూమిలో పరమశివుడు, నందీశ్వరుడు విగ్రహాలను బుధవారం ప్రారంభించారు. వేదపండితులు లంకభవానీ శంకర్ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు చేశారు.

చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురం వెలసి ఉన్న శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన బుధవారం స్వామివారు శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై శ్రీరామ కృష్ణ గోవింద అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఒంగోలు బీఆర్‌ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న చుండూరి రవికుమార్‌ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. సముద్ర తీర ప్రాంతానికి వచ్చిన పర్యాటకులను ఇది ఎంతగానో ఆకట్టుకుంది.

చిత్తూరు జిల్లాలో ఓ ద్విచక్ర వాహన చోదకుడు వినూత్నంగా రూపొందించిన శిరస్త్రాణం ధరించి తిరుపతి నుంచి తిరుచానూరు వెళ్తూ పద్మావతిపురంలో మంగళవారం కనిపించారు. అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

 అందాల ముద్దుగుమ్మలు అదిరేటి డ్రెస్సుల్లో తళుక్కున మెరిశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌10లో ఓ స్టోర్‌లో జరిగిన ఫ్యాషన్‌ షోలో నటి కాజల్‌ అగర్వాల్‌తోపాటు పలువురు మోడళ్లు డిజైనర్‌ దుస్తుల్లో ర్యాంప్‌పై హొయలొలికించారు.

అంబర్‌పేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల పక్కన చెత్త, వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పడేస్తున్నారు. మళ్లీ అక్కడ చెత్త వేయకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో పోగైన చెత్తను తొలగించి.. అందమైన రంగురంగుల బొమ్మలను చిత్రీకరించారు. 

బెంగళూరు మారతహళ్లి దేవాలయ నిర్వాహకుల కోరిక మేరకు 18 అడుగుల ఫైబర్‌ శివలింగాకారం రూపొందించామని తెనాలి కాటూరి శిల్పశాల శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు. లక్షలాది మంది భక్తులు పూజించేందుకు మహాశివరాత్రికి ఆ ఆలయ ప్రాంగణంలో శివలింగాకారం ఉంచుతారని పేర్కొన్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు తో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు వీరిద్దరూ చర్చించారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home