చిత్రం చెప్పే విశేషాలు

(07-03-2024/2)

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వరస్వామివారు ర‌థాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.

ప్రధాని మోదీ శ్రీనగర్‌లోని శంకరాచార్య కొండను సందర్శించారు. సంబంధిత చిత్రాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. 

 జవహర్ నగర్ ఆర్మీ దంత కళాశాల స్నాతకోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రోఫీలను అందజేశారు. 

 శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకి మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. 

స్వాతంత్ర్య సమరయోధులు వంగల్లు కోదండరామిరెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని నెల్లూరులోని డా. రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్ ఫంక్షన్ హాల్‌లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి గుత్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేశారు. 

మాజీ మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌జిల్లా ఇరుకుళ్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా నీరందక ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, మంత్రి సీతక్క, ప్రముఖులు, మహిళలు హాజరయ్యారు. 

జిమ్‌.. జామ్‌..

చిత్రం చెప్పే విశేషాలు..(21-04-2024)

హైదరాబాద్‌ ఆటగాళ్ల సంబరాలు చూశారా!

Eenadu.net Home