చిత్రం చెప్పే విశేషాలు


(08-03-2024/1)

ఒంగోలులో గురువారం కనిపించిన ఓ ఘటన అందరినీ కలచివేసింది. చిన్న చిన్న పనులు చేసుకుని రహదారి పక్కనే నివసించే కుటుంబానికి చెందిన వృద్ధురాలు ప్రమాదవశాత్తు పడిపోవడంతో కాలు విరిగిపోయింది. వాహనంలో తీసుకొచ్చేందుకు డబ్బులు లేక ఓ ఫ్లెక్సీపై కూర్చోబెట్టి ఇలా ఈడ్చుకుంటూ వచ్చారు. 

వేసవి కాలం ప్రారంభం కాగానే నోరూరే మామిడి పండ్లు మార్కెట్లలోకి వస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఇంకా కాయ దశలోనే తోటల్లో ఉన్నాయి. మార్కెట్లలోని వ్యాపారులు వేరే ప్రాంతాల నుంచి మామిడి పండ్లను తెప్పిస్తున్నారు. ప్రస్తుతం కిలో ధర రూ.200 పలుకుతోంది. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏరూరుకు చెందిన మంచాల సనత్‌కుమార్‌ తీర్చిదిద్దిన సైకతశిల్పం ఆకట్టుకుంది.  

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నాగరాత్రిని పురస్కరించుకుని సోమస్కందమూర్తి ఆదిశేషునిపై, ఆయన దేవేరి జ్ఞానాంబిక యాళీ వాహనంపై కొలువుదీరారు. శివపరివారం విహారంతో పురవీధులు పులకించిపోయాయి.

మహా శివరాత్రి, మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి చెక్కపై ఆయా బొమ్మలను అందంగా మలిచాడు. ‘మూడు గంటల సమయంలో చెక్కపై నంది, శివలింగం, శివ రూపాలను తయారు చేశాను. 

తూటిపాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు బి.రవికుమార్‌ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పేపరుపై 1614 నువ్వు గింజలు అంటించి దాని మధ్యలో సూక్ష్మలిపిలో బిల్వాష్టకం, లింగాష్టకం రాశారు. ఇందుకోసం 25 గంటలపాటు శ్రమించినట్లు తెలిపారు.  

 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రోలుగుంటకు చెందిన స్వర్ణకారుడు వైదాసు శ్రీనివాసరావు బంగారు తీగలతో 12 గంటలపాటు శ్రమించి ఐదు శివలింగాలను తీరిదిద్దారు. ఒక్కో శివలింగం పరిమాణం సుమారు 200 మి.మీ. కాగా.. 5 మి.మీ. పొడవు, వెడల్పుతో బొటన వేలి గోటిపై నిలిచేలా తయారుచేశారు.

మహాశివరాత్రిని పురష్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. రామాయంపేట పట్టణంలోని పురాతన నగరేశ్వర ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఏడుపాయల వనదుర్గా ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రామాయంపేట, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం రామాయంపేటలో పోలీసులు కవాతు నిర్వహించారు. మండల పరిధి లింగాపూర్‌ గ్రామంలోనూ ఎస్సై రంజిత్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. 

జిమ్‌.. జామ్‌..

చిత్రం చెప్పే విశేషాలు..(21-04-2024)

హైదరాబాద్‌ ఆటగాళ్ల సంబరాలు చూశారా!

Eenadu.net Home