చిత్రం చెప్పే విశేషాలు

(08-03-2024/2)

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

విజయవాడలోని ఓ జ్యువెలరీ స్టోర్‌ వార్షికోత్సవంలో సినీనటి ఈషా రెబ్బ సందడి చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన నూతన ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిచ్చారు.

 శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.

మంచు విష్ణు ప్రధానపాత్రలో నటిస్తోన్న ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు.

తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు గోపీచంద్‌ దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ‘భీమా’ చిత్రబృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

మహా శివరాత్రి సందర్భంగా నారా లోకేశ్‌ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. సాయీశ్వర లింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

సినీనటి తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఓదెల 2’. శివరాత్రి సందర్భంగా తమన్నా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం పంచుకుంది. 

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

చిత్రం చెప్పే విశేషాలు (20-04-2024/1)

Eenadu.net Home