చిత్రం చెప్పే విశేషాలు

(10-03-2024/2)

బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరుగుతున్న ముఖ్యమంత్రి సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు తరలి వెళ్లడంతో చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 96 బస్సులు ఉండగా 80 బస్సులవరకు సభకు వెళ్లాయి.

 ప్రపంచ కిడ్నీ డే సంద‌ర్భంగా ఆరోగ్యంపై ప్రజల్లో అవ‌గాహ‌న కోసం ఏఐఎన్‌యూ ఆధ్వర్యంలో గ‌చ్చిబౌలి స్టేడియంలో అవగాహన ర‌న్‌ నిర్వహించారు. పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్లోని జలవిహార్ వద్ద ఉన్న డాగ్స్ పార్కులో ఆదివారం పలు జాతుల శునకాలతో సందడి వాతావరణం నెలకొంది. పలువురు జంతు ప్రేమికులు శునకాలను పార్కుకు తీసుకుని వచ్చి సందడి చేశారు.

సినీనటి సంయుక్త మీనన్‌ హైదరాబాద్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఒక కొత్త బ్రాండ్‌ మొబైల్‌ను ఆవిష్కరించారు.

ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్ర ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో పాటు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 70,000 మంది నిరాశ్రయులయ్యారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. వివిధ రకాల దుస్తులు, వస్త్రాలు ఆకట్టుకున్నాయి. మోడల్స్‌, ఫ్యాషన్‌ ప్రియులు హాజరై ఫొటోలు దిగి సందడి చేశారు.

ఉరవకొండలో తెదేపా ఆధ్వర్యంలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాల్గొని ప్రసంగించారు. 

దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్‌ భవన నిర్మాణం కోసం ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ రూ. కోటి ఆర్థిక సహాయం చేశారు. అందుకు సంబంధించిన చెక్‌ను హీరో కార్తీకి అందజేశారు. 

జిమ్‌.. జామ్‌..

చిత్రం చెప్పే విశేషాలు..(21-04-2024)

హైదరాబాద్‌ ఆటగాళ్ల సంబరాలు చూశారా!

Eenadu.net Home