చిత్రం చెప్పే విశేషాలు

(11-03-2024/1)

సీట్ల సర్దుబాటుపై తెదేపా అధినేత చంద్రబాబు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, తదితర నాయకులతో సమావేశమయ్యారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. 

సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  

నటుడు కిరణ్‌ అబ్బవరం.. హీరోయిన్‌ రహస్య గోరక్‌ను పెళ్లి చేసుకోనున్నారు. మార్చి 13న వీరి నిశ్చితార్థం జరగనుంది.

అపోలో ఆసుపత్రులకు సంబంధించిన బ్రాంచ్‌ను అయోధ్యలో ప్రారంభించారు. ఈ మేరకు ఉపాసన సంబంధిత ఫొటోలను పంచుకున్నారు. 

సుందరీకరణలో భాగంగా నెక్లెస్‌ రోడ్డులో ఇందిరా గాంధీ కూడలిలో ఏర్పాటుచేసిన జింకల శిలలు ఇవి. ఉదయిస్తున్న సూర్యుడిని ఓ జింక ఆకృతి ముద్డాడుతున్నట్లు కనిపించిన దృశ్యం ఆకట్టుకుంది. 

అనంతరపురంలో తెదేపా ఆధ్వర్యంలో శంఖారావం సభను నిర్వహించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 

 అల్లరి నరేష్‌-ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మంగళవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం పోస్టర్‌ ద్వారా పంచుకుంది. 

నటుడు, దర్శకుడు సూర్య కిరణ్‌ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు.

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

చిత్రం చెప్పే విశేషాలు (20-04-2024/1)

Eenadu.net Home