చిత్రం చెప్పే విశేషాలు

(12-03-2024/1)

ఎల్బీ స్టేడియంలో భాజపా బూత్‌ అధ్యక్షుల ‘విజయ సంకల్ప’ సమ్మేళనాన్ని నిర్వహించారు. కేంద్రహోం మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

టీఎస్‌ఆర్టీసీలో కొత్తగా 22 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు.

మంత్రి రోజ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. 

టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ‘సౌత్ బై సౌత్‌వెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ సందర్భంగా ‘మంకీ మ్యాన్’ ప్రీమియర్‌ ఈవెంట్‌లో నటి శోభితా ధూళిపాళ్ల ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా ఇండోనేసియాలోని హస్నా ఇస్లామిక్‌ పాఠశాలలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు భారీఎత్తున్న ప్రార్థనలు చేశారు.  

 సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడిచే రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో, నటి ప్రేమ ప్రధానపాత్రలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ‘దేవి’. ఈ చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం పోస్టర్‌ ద్వారా తెలియజేసింది.  

నటి అనుష్క శెట్టి, జయసూర్య జంటగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘కథనార్‌- ది వైల్డ్‌ సోర్సెరర్‌’. రోజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలను దర్శకుడు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home