చిత్రం చెప్పే విశేషాలు
(12-03-2024/2)
కేంద్ర మంత్రి అమిత్ షా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
టీఎస్‌ఆర్టీసీ కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా బస్సు నడిపారు.
తిరుమల శ్రీవారిని రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం పోస్టర్‌ను పంచుకుంది.
పీజేటీఎస్‌ఏయూలో విద్యార్థుల అంతర్ కళాశాలల సాంస్కృతిక, సాహిత్య పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీలలో 11 కళాశాలకు చెందిన 205 మంది విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనబరుస్తున్నారు.
దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్ భవన నిర్మాణం కోసం నటుడు విజయ్ దళపతి రూ. కోటి ఆర్థిక సహాయం చేశారు. ఈ విషయాన్ని నటుడు విశాల్ ట్వీట్ చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం సోమవారం మారిషస్ చేరుకున్నా. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘భారత్ శక్తి’ పేరిట రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో విన్యాసాలు నిర్వహించారు. ఆకాశంలో యుద్ధవిమానాల గర్జన, నేలపై సేనల పరాక్రమం.. సరికొత్త భారత్‌కు నిదర్శనంగా నిలుస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫొటోలను ఎక్స్‌లో పంచుకున్నారు.