చిత్రం చెప్పే విశేషాలు

(14-03-2024/2)

జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ గురువారం 18,629 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. 

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ భాజపా నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. 

కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కొద్ది రోజుల క్రితం సంజీవ్‌ వైకాపాకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దివ్యాంగురాలైన భాగ్య అనే విద్యార్థితో కలిసి మంత్రి సీతక్క డ్యాన్స్ చేశారు.

హీరో కిరణ్‌ అబ్బవరం-రహస్య గోరక్‌ నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కిరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. అనంతరం వసతి గృహల నుంచి విద్యార్థులు తల్లితండ్రులతో, బంధువులతో కలసి సొంత ఊళ్లకు పయనమయ్యారు.

పోలీసు అధికారిగా ఆర్కే సాగర్‌ నటిస్తున్న చిత్రం ‘ది 100’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేశారు. 

భూటాన్‌ ప్రధాని షెరింగ్ టోబ్గే భారత్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాల గూర్చి చర్చించారు. 

జిమ్‌.. జామ్‌..

చిత్రం చెప్పే విశేషాలు..(21-04-2024)

హైదరాబాద్‌ ఆటగాళ్ల సంబరాలు చూశారా!

Eenadu.net Home