చిత్రం చెప్పే విశేషాలు

(15-03-2024/2)

తెలంగాణలో భాజపా విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షో నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో పాటు పలురు భాజపా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు తెలంగాణ ఇఫ్తార్‌ విందు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, షడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

హీరో వెంకటేష్‌ రెండో కుమార్తె హయ వాహినికి విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడితో వివాహం జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెహందీ వేడుకకు నమ్రత హాజరయ్యారు.

హైటెక్‌సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌లో సినీ నటీమణులు దివి, స్రవంతి చొక్కారపు, పలువురు మోడల్స్‌ హాజరై ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

ఏపీలో ఇంటర్‌ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. పరీక్ష పూర్తయిన అనంతరం విద్యార్థులు గాల్లో పేపర్లు ఎగరవేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలకు రావాలని ఆలయ అర్చకులు సీఎం రేవంత్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు శేష వస్త్రంతో సన్మానించి ఆహ్వాన పత్రికను అందించారు.

కన్హశాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవ్‌ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ సాదర స్వాగతం పలికారు. 

హీరో ఆనంద్‌ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా విజయ్‌ దేవరకొండ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు విజయ్‌ ట్వీట్‌ చేశారు. 

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

చిత్రం చెప్పే విశేషాలు (20-04-2024/1)

Eenadu.net Home