చిత్రం చెప్పే విశేషాలు
(16-03-2024/1)
సినీనటులు దివి, స్రవంతితోపాటు పలువురు రూపదర్శినులు శుక్రవారం మాదాపూర్ హెచ్‌ఐసీసీలో సందడి చేశారు. హై లైఫ్ పేరిట ఇక్కడ ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శనను దివి, స్రవంతి ముఖ్యఅతిథులుగా విచ్చేసి ప్రారంభించారు.
అమెరికాలోని కొలరాడోలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఇళ్లు, రహదారులు పలు నిర్మాణాలపై మంచు విపరీతంగా కురుస్తోంది. రహదారులపై మంచు పేరుకుపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ కార్మికులు రహదారులపై పేరుకుపోయిన మంచును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం ధర్మాపురంలో రైతు రవిశంకర్‌నాయుడు సాగు చేసిన అరటి తోటలో ఒక చెట్టు 5 గెలలు వేసింది. పదేళ్లుగా అరటి సాగు చేస్తున్నా.. ఇలా ఎన్నడూ చూడలేదని రైతు ఆనందం వ్యక్తం చేశారు.
బ్రహ్మపురలోని ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు నగర శివారున ఐటీఐ బాలికల వసతి గృహం ఆవరణలో 21 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పున ప్లాస్టిక్ సీసాలతో చేప ఆకృతిని తీర్చిదిద్దారు. అందులో సుమారు 20 వేల పాత ప్లాస్టిక్ సీసాలను నింపారు.
మన్యం దుప్పిలవాడ పంచాయతీలోని జొన్నమామిడి సమీపంలో సెల్ టవర్ నిర్మించడానికి అవసరమైన సామగ్రిని తరలించడానికి గుర్రాలను వాడుతున్నారు. సీలేరు ఐస్‌గెడ్డ సమీప రోడ్డు పాయింట్ నుంచి ఆ ప్రాంతాలకు వెళ్లడానికి కనీసం కాలిబాట కూడా లేదు. దీంతో జి.మాడుగుల నుంచి 43 గుర్రాలు తీసుకొచ్చారు.
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు.
అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా స్థానిక చిల్డ్రన్స్ పార్క్‌లోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.