చిత్రం చెప్పే విశేషాలు

(16-03-2024/2)

రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన తాజాగా ఆమె క్లీంకారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు.  

నిజామాబాద్‌లో నటి రాశీ ఖన్నా సందడి చేశారు. నగరంలోని ఓ ఆస్పత్రి నాలుగో వార్షికోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.  

 కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం.. సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలు విషయాలు గురించి చర్చించారు. 

‘తీన్‌మార్‌’ ఫేమ్‌ కృతి కర్భందా తన ప్రియుడు పులకిత్‌ సామ్రాట్‌ను వివాహం చేసుకున్నారు. శుక్రవారం గురుగ్రామ్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. 

 హీరో అశ్విన్‌, సంగీత దర్శకుడు తమన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. పలు చోట్ల భారాస కార్యకర్తుల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

నాగర్‌కర్నూల్‌లో భాజపా బహిరంగ సభ నిర్వహించారు. ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు. మరోసారి భాజపాను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

చిత్రం చెప్పే విశేషాలు (12-04-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు(12-04-2024/1)

నానో న్యూస్‌ (12/ 04/ 2024)

Eenadu.net Home