చిత్రం చెప్పే విశేషాలు

(17-03-2024/1)

క్రీస్తు శకం 13, 14 దశాబ్దంలో రేచర్ల వంశీయులు వెల్మరాజులు ఏలిన నల్గొండ జిల్లా దేవరకొండ ఖిల్లా దుర్గం ఎంతో చరిత్రాత్మకమైనది. ఈ అద్భుతమైన ఖిల్లాపై అస్తమిస్తున్న సూర్యుడు స్వర్ణకాంతులీనుతూ చేసిన దృశ్యాలు దేవరకొండ పట్టణ ప్రజలకు కనువిందు చేస్తున్నాయి.

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘనంగా మర్హం ‘ఆటిజం ఆరా’ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌లో సినీనటి మంచు లక్ష్మి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ హాజరై సందడి చేశారు. చిన్నారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.

ఏపీ రాష్ట్ర రాజకీయ చరిత్ర గతినే మార్చేసే కీలక ఘట్టం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆవిష్కృతమవుతోంది. తెదేపా, జనసేన, భాజపా మూడు పార్టీలూ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న బహిరంగసభకు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి.

తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘శారీ రన్‌’ నిర్వహించాయి. పీపుల్స్‌ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు.

ఏపీ రాష్ట్రంలో ఆదివారం ఏపీపీఏస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది. పరీక్ష రాసేందుకు ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. 

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సినీనటి రాశీ ఖన్నా శనివారం సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. ఆమెను చూసేందుకు, ఫొటోలు తీసేందుకు అభిమానులు పోటీపడ్డారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హశాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం నిర్వహించిన నృత్యరూపకం ఆకట్టుకుంది. 

 రంగురంగుల పువ్వులు, దేవతామూర్తుల బొమ్మలు, మగువల ఆలోచనలను తమదైన శైలీలో కాన్వాస్‌పై ఆవిష్కరించారు చిత్రకారులు. ఈ చిత్రాలను మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు.

సాధారణంగా బొప్పాయి చెట్లు ఒక మోస్తరు ఎత్తు వరకే ఎదుగుతాయి. వీటి కాండాల్లో అధిక శాతం నీరు ఉండటం వల్ల ఇవి అంత ఎత్తుగా ఎదగవు. చింతపల్లిలోని ముత్యాలమ్మ ఆలయం సమీపంలో అంగన్‌వాడీ భవనం వద్ద ఒక బొప్పాయి వృక్షం ఏకంగా తాటిచెట్టంత ఎత్తులో ఎదుగుతోంది.

చార్మినార్‌ పరిసరాల్లో శనివారం సందడి నెలకొంది. ఇంటర్‌ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో విద్యార్థులు, యువతులు పోటెత్తారు. గాజులు, వస్త్రాలు, అలంకరణ సామగ్రి కొనుగోలు చేశారు. స్వీయచిత్రాలు దిగి సందడి చేశారు.  

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home