చిత్రం చెప్పే విశేషాలు

(17-03-2024/2)

 కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక ముంబయిలోని గాంధీ మ్యూజియంను సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీకి నివాళులర్పించారు. 

 భారాసకు చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

 ఐస్‌ల్యాండ్‌లోని హగాఫెల్, స్టెరి-స్కాగ్ఫెల్ మధ్య ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో లావా విస్ఫోటనం చెందుతోంది. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘శారీ రన్‌’ నిర్వహించాయి. పీపుల్స్‌ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు.

మహిళల ఐపీఎల్‌(WPL 2024)లో యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎలీస్‌ పెర్రీ కొట్టిన సిక్స్‌కు బౌండరీ ఆవల ప్రదర్శనకు ఉంచిన టాటా పంచ్‌ ఈవీ కారు అద్దం పగిలింది. ఆ సిక్సర్‌కు గుర్తుగా టాటా సంస్థ.. పగిలిన ఆ కారు అద్దాన్ని ప్రేమ్‌ కట్టించి పెర్రీకి బహూకరించింది. 

విశాఖ సాగర తీరంలో ఇటీవల ఏర్పాటు చేసిన ‘ఫ్లోటింగ్ బ్రిడ్జి’ అలల తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో మిగిలిన ఆ బ్రిడ్జి పరికరాలను ఇలా ఒడ్డున వేశారు.

 విశాఖలోని రిషికొండ వద్ద పర్యాటకులకు ఆహ్లాద వాతావరణం కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం ఇలా కొండ, పక్కనే రహదారి ఆకర్షణీయంగా కనిపించింది.

సేవ్ ద గర్ల్ చైల్డ్, ముందడుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 మందికి మహిళా సాధికారత అవార్డులు ప్రదానం చేశారు. ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, అజయ్ మిశ్రా హాజరయ్యారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home