చిత్రం చెప్పే విశేషాలు

(18-03-2024/2)

 జగిత్యాలలో భాజపా ‘విజయ సంకల్ప సభ’ను నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సోమవారం హైదరాబాద్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్‌కు ర్యాలీగా వెళ్లారు.

‘గుడ్‌నైట్‌’ ఫేమ్‌ మీతా రఘునాథ్‌ వివాహ బంధంలో అడుగుపెట్టారు. సంబంధిత చిత్రాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సోమవారం పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది. 

నటుడు రోషన్‌, యాంకర్‌ సుమ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి మెట్టు మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.  

హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ తన తమ్ముడి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సంబంధిత చిత్రాలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

సీఎం రేవంత్‌.. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీని దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎంపీ అభ్యర్థుల ఖరారుపై చర్చించారు.

 విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ భారాసలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

చిత్రం చెప్పే విశేషాలు (20-04-2024/1)

Eenadu.net Home