చిత్రం చెప్పే విశేషాలు

(19-03-2024/1)

 ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు చోట్ల మంగళవారం వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. 

 ఐస్‌ల్యాండ్‌లోని ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో లావా విస్ఫోటనం చెందుతోంది. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నటుడు రాజీవ్‌ కనకాల కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 

జపాన్‌లో జరిగిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రీనింగ్‌కు వెళ్లిన రాజమౌళికి ఓ వృద్ధురాలు 1000 ఆర్గామి క్రేన్స్‌ను బహుమతిగా ఇచ్చింది. ఆర్గామి క్రేన్స్‌ను తమకి ఇష్టమైన వారికోసం, వారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఇస్తారు. ఈ చిత్రాలను రాజమౌళి ఎక్స్‌లో పంచుకున్నారు.

 బంజారాహిల్స్‌లో డి సన్స్ పటోలా ఆర్ట్ ప్రదర్శనను బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటి అశ్విని శ్రీ ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల వస్త్రాలు, ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి.

పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. శ్రీలీల కథానాయిక. ఈ సినిమాకు సంబంధించి ‘భగత్స్‌ బ్లేజ్‌’ అంటూ చిత్ర బృందం వీడియోను పంచుకుంది.

కామారెడ్డి జిల్లా బిక్కనూరులో వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతన్నలు రోడ్లెక్కారు. దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home