చిత్రం చెప్పే విశేషాలు

(19-03-2024/2)

 జర్మనీలోని కైసర్‌లౌటర్న్‌లో ఓ విండ్ ఎనర్జీ ప్లాంట్‌ నుంచి దట్టమైన పొగ వెలువడింది. ఉదయం ఆ ప్రాంతమంతా పొగమంచుతో నిండిపోయింది.

మలయాళ నటుడు ‘ఫహద్‌ ఫాజిల్‌’ నటిస్తోన్న చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. శశాంక్‌ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్స్‌తో పాటు, పోస్టర్‌ను చిత్రబృందం పంచుకుంది.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

బుధవారం నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పరిసర వీధులను అందంగా ముస్తాబు చేశారు. 

 నటుడు మోహన్‌లాల్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 

అనంతపురం జిల్లాలోని నార్పల నుంచి నాయనిపల్లి రహదారిలో అరటి పిలకలు వేశారు. వేసవిలో వాటికి ఎండదెబ్బ తగలకుండా చుట్టూ ఇలా ఈతకొమ్మలు నాటారు.

వేసవికాలంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి చిన్నారుల కోసం సికింద్రాబాద్ మారేడ్‌పల్లి ప్రధాన రహదారిపై చిన్న ఫ్యాన్‌లను విక్రయిస్తున్నారు. ఒక్క ఫ్యాన్‌ ఖరీదు రూ. 300. ఫోన్‌ చార్జర్‌ ద్వారా వీటికి చార్జింగ్‌ పెట్టవచ్చునని వ్యాపారి తెలిపారు.

అమెరికాలో ‘ఫ్రీడమ్‌ మాన్యుమెంట్‌ స్కల్‌ప్చర్‌’ పార్కులో పర్యాటకులను ఆకట్టుకొనేందుకు బొమ్మలను ఏర్పాటు చేశారు. అలబామా రాష్ట్ర రాజధాని నగరం మోంట్‌గోమేరీలోని పార్కులో వివిధ రకాల శిల్పకళా రూపాలు దర్శనమిస్తున్నాయి.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home