చిత్రం చెప్పే విశేషాలు

(21-03-2024/1)

చూసేవారికి ఎక్కడి నుంచో తెచ్చి నేలపై ఉంచినట్లు కనిపించే ఈ వృక్షాల పేరు ఫికస్‌ మైక్రోకార్పా బోన్సాయ్‌. మాదాపూర్‌ దుర్గంచెరువు పార్కు బయట ఆకట్టుకొంటున్నాయి. సందర్శకులు వీటి చెంత స్వీయచిత్రాలు దిగుతూ సందడి చేస్తున్నారు.

కర్ణాటక పర్యాటక శాఖ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులు పాల్గొన్నారు. ప్రసన్న సైకియా, నందితా మొండల్, బ్రాండీ లీరే తదితరులు గంటకుపైగా సృజనాత్మక నృత్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో శ్యామ్‌ అనే మత్స్యకారుడికి బుధవారం రంగురంగుల రొయ్య చిక్కింది. సాధారణ రొయ్య కంటే భిన్నంగా వైవిధ్య రంగులతో ఆకట్టుకోవడంతో స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు. ఈ తరహా రొయ్యలు అరుదుగా మాత్రమే కనిపిస్తాయని మత్స్యకారులు తెలిపారు. 

భెల్‌ కూడలిలో సినీ హీరో రామ్‌ పోతినేని సందడి చేశారు. బుధవారం భెల్‌ కూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సినీ హీరో రామ్‌ అభిమానులకు అభివాదం చేశారు. అభిమానులతో సెల్ఫీలు తీసుకొంటూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. 

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగు శాతం పెంచడానికి కడలూర్‌ జిల్లా దేవనంపట్టిణం తీరంలో ఓటరు అవగాహన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. దీనిని జిల్లా కలెక్టరు, ఎన్నికల అధికారి అరుణ తంబురాజ్‌ బుధవారం ఆవిష్కరించారు.

ఊటీలో పుష్పాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. బొటానికల్‌ గార్డెన్‌లో పుష్ప ప్రదర్శన కోసం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 35 వేల తొట్టెల్లో మొక్కలు నాటారు. అద్దాల మాలిగలో పుష్ప గోపురం ఏర్పాటు చేశారు. పర్యాటకులు వాటివద్ద సెల్ఫీ తీసుకొని సంబరపడిపోతున్నారు. 

అసలే భగభగ మండే వేసవి కాలం. అవి ఎప్పుడు వేడెక్కుతాయో తెలీదు. నియంత్రికలు, ఫ్యూజ్‌ బాక్సుల కింద వీళ్లేమో ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే నష్టం ఊహించడం కష్టమే. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో, ఆల్ఫా హోటల్‌ వద్ద కనిపించాయి ఈ చిత్రాలు.

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. గతంలో గాజులరామారంలో గోడలపై రాజకీయ నాయకులు రాయించిన ప్రచార రాతలపై సిబ్బంది తెల్లరంగు వేశారు. పోస్టర్లను కూడా తొలగించారు. 

కేపీహెచ్‌బీ కూకట్‌పల్లి నుంచి నిజాంపేటకు వెళ్లే ప్రధాన దారిపై నిజాంపేట మున్సిపల్‌ పైలాన్‌ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి రెండు అక్షరాలు ఊడిపోయాయి. దీంతో నిజాంపేట పేరు నంపేటగా కనిపిస్తోంది. ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. 

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home