చిత్రం చెప్పే విశేషాలు

(21-03-2024/2)

దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సినీనటి రీతూవర్మ బుధవారం సందడి చేశారు. ఓ ఆభరణాల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అభిమానులతో ముచ్చటించి అలరించారు.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు బుధవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి పుష్కరిణిలో సంధ్యాసమయాన రామావతారంలో తెప్పపై స్వామివారు ఆనంద విహారం చేశారు.


రామ్‌ చరణ్‌ హీరో, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభించారు. 

భారత్‌- అమెరికా దేశాలు సంయుక్తగా విశాఖలో నిర్వహిస్తున్న టైగర్‌ ట్రయంఫ్‌-24 విన్యాసాల్లో పాల్గొనేందుకు బుధవారం నగరానికి చేరిన అమెరికా యుద్ధవిమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అనంతగిరి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షాలతో జీడిమామిడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాల వల్ల తోటల్లో పూత నిలబడి జీడి పిక్కల దిగుబడి పెరుగుతుందని పలువురు రైతులు పేర్కొన్నారు.  

సినీ నటి, టీవీ యాంకర్‌ అనసూయ బుధవారం విశాఖ జిల్లా పాయకరావు పేటలో లక్కీ షాపింగ్‌ మాల్‌ బ్రాంచి ప్రారంభ వేడుకల్లో పాల్గొని సందడి చేసింది.

గజ్వేల్, మర్కూక్‌ మండలాల పరిధిలో ఇళ్ల ముందు నుంచే వెళుతున్న కొండపోచమ్మ సాగర్‌ జలాల్లో పిల్లలు దూకి ఈత కొడుతున్నారు. ఈత రాని పిల్లలు, లోతు ఎక్కువగా ఉన్న చోట మునిగిపోయే ప్రమాదం ఉంది. అపాయం జరిగిన తరువాత బాధపడేకన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.

చిత్రం చెప్పే విశేషాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home