చిత్రం చెప్పే విశేషాలు
(22-03-2024/2)
ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు.
నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి కడపలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించారు.
తెదేపా అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా పెంచలకోన లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
జమ్మికుంట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ 25వ వార్షికోత్సవ ద్వితీయ పుష్కర మహా కుంభాభిషేకాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం స్వామి వారి రథోత్సవం నిర్వహించారు.
మద్యం కుంభకోణంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
భారాస మరో రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూలు నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మెదక్ నుంచి మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
హోళీ పండుగ సమీపిస్తున్న తరుణంలో రంగుల దుకాణాల వద్ద సందడి నెలకొంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా రంగులు కొంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ను 110 ఏళ్ల నాటి తకరాజుకా సంస్థ నిర్వహించే మ్యూజికల్ థియేటర్‌లో ప్రదర్శించారు. దీంతో ‘జపనీస్ ఆడియన్స్‌కు ధన్యవాదాలు. ఈ షోలో మీ శక్తి, ప్రతిభ ఆశ్చర్యపరిచాయి. ఈ కార్యక్రమంలో భాగమైన అమ్మాయిలను అభినందించకుండా ఉండలేకపోతున్నా’ అని ట్వీట్ చేశారు.