చిత్రం చెప్పే విశేషాలు

(23-03-2024/2)

భూటాన్‌ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ దిల్లీ పయనమయ్యారు. ఈ సందర్భంగా భూటాన్‌ రాజు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. 

సీఎం రేవంత్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాన్ని అందించారు. 

 ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించి వారికి భరోసానిచ్చారు. 

మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్‌ గ్యాలరీ ఆకట్టుకుంటుంది. వీటిని వీక్షించడానికి సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. 

తెలుగు చలన చిత్ర పరిశ్రమ 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.

దిల్లీపై పంజాబ్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దిల్లీ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ అభ్యర్థిని జనసేన పార్టీ ఖరారు చేసింది. గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

తన ప్రియుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌తో నటి అమీజాక్సన్‌ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం వీరిద్దరూ తాజాగా ఎంగేజ్‌మెంట్‌ డిన్నర్‌ పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

చిత్రం చెప్పే విశేషాలు (20-04-2024/1)

Eenadu.net Home