చిత్రం చెప్పే విశేషాలు

(24-03-2024/2)

 ప్రముఖ నటి సమంత ఫ్యాన్స్‌ మీట్‌లో సందడి చేశారు. అభిమానులతో సరదాగా ముచ్చటించారు.

ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ.. ముఖ్యమంత్రి రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుస్తకాన్ని అందించారు.  

హైదరాబాద్‌లో హోలి సంబరాలు మొదలయ్యాయి. యువతీ, యువకులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు.

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

చింతలపూడి వైకాపా ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఎలీజాకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

జర్మనీలో మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.  

మాదాపూర్‌లోని శిల్పారామంలో కుమారి ఐశ్వర్య వల్లి శిష్యబృందం ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. పలువురు ఆసక్తిగా తిలకించారు.

తెలంగాణ గేయం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ దంపతులను సీఎం రేవంత్‌ సన్మానించారు. 

 సినీ నటి మృణాల్‌ ఠాకూర్‌ బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 

జిమ్‌.. జామ్‌..

చిత్రం చెప్పే విశేషాలు..(21-04-2024)

హైదరాబాద్‌ ఆటగాళ్ల సంబరాలు చూశారా!

Eenadu.net Home