చిత్రం చెప్పే విశేషాలు

(26-03-2024/1)

తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

తెదేపా నేత అచ్చెన్నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

ఆంధ్రా, తెలంగాణకు బ్రిటిష్‌ డిప్యూటీ కమిషనర్‌గా వ్యవహరిస్తోన్న గారెత్‌ విన్‌ ఓవెన్‌ హీరో నానిని కలిశారు. హైదరాబాద్‌లోని నాని నివాసానికి వెళ్లిన గారెత్‌ కొంత సమయం గడిపారు.

ఐస్‌ల్యాండ్‌లోని గ్రిండావిక్ పట్టణానికి సమీపంలోని ఓ అగ్నిపర్వతం బద్దలైంది. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి గరుత్మంతుడి వాహనంపై ఆలయ తిరు వీధుల్లో ఊరేగారు. 

ఐపీఎల్‌ 17 సీజన్లో భాగంగా బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌, ముంబయి జట్లు తలపడనున్నాయి. స్టేడియంలో పోలీసులు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

మాజీ సీజే జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 

రామ్‌చరణ్- కియారా ఆడ్వాణీ జంటగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. బుధవారం చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఓ పాటను విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలియజేసింది.

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

చిత్రం చెప్పే విశేషాలు (20-04-2024/1)

Eenadu.net Home