చిత్రం చెప్పే విశేషాలు

(26-03-2024/2)

మాజీ సీఎం కేసీఆర్‌ను కడియం కావ్య మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ కోసం రూ.10 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ మేరకు చెక్కును పార్టీ కోశాధికారికి అందించారు.

సినీనటి నయనతార తన కుమారులతో సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను షేర్‌ చేశారు. అవి నెట్టింట వైరల్‌గా మారాయి. 

చేవెళ్లలో సీఎం రేవంత్‌.. పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల గూర్చి వివరించారు. 

 తెలంగాణ భవన్‌లో భారాస నాయకుల సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో చేయాల్సిన విధి విధానాల గూర్చి మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. 

అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో నౌక ఢీ కొనడంతో ఒక బ్రిడ్జ్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో వంతెనపై ఉన్న వాహనాలు నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డా. జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 

దిలీప్‌ ప్రకాశ్‌, రెజీనా కసాండ్రా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉత్సవం’. ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం పోస్టర్‌ ఆధారంగా శుభాకాంక్షలు తెలిపింది.

ఓ చెలియా నా ప్రియ సఖియా..

మీకు కాఫీ నా.. టీ నా...

చిత్రం చెప్పే విశేషాలు (20-04-2024/1)

Eenadu.net Home