చిత్రం చెప్పే విశేషాలు

(28-03-2024/2)

సీఎం రేవంత్‌రెడ్డి.. సీజే జస్టిస్‌ డీవై చంద్రఛూడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందజేశాడు.  

సినీనటి నిధి అగర్వాల్‌ హైదరాబాద్‌లో సందడి చేశారు. ఉప్పల్‌లో ఓ వస్త్ర దుకాణానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

 రాజన్నసిరిసిల్లా జిల్లాలో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను మాజీ మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. వెంటనే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను ఆమె పరామర్శించారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 

పెళ్లి గురించి తమపై వస్తున్న వార్తలపై హీరో సిద్ధార్థ్‌, నటి అతిథిరావు హైదరి స్పందించారు. ఎంగేజ్‌ మెంట్‌ జరిగినట్లు ఫొటోను షేర్‌ చేశారు.

ఫిల్మ్‌ నగర్‌లోని ఓ సెలూన్‌ ప్రారంభోత్సవంలో నటి అనసూయ సందడి చేశారు. అనంతరం అక్కడి నిర్వాహకులు, అభిమానులతో ముచ్చటించి ఫొటోలకు పోజులిచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాప్తాడులో ప్రజాగళం పేరిట తెదేపా అధినేత చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

జిమ్‌.. జామ్‌..

చిత్రం చెప్పే విశేషాలు..(21-04-2024)

హైదరాబాద్‌ ఆటగాళ్ల సంబరాలు చూశారా!

Eenadu.net Home