చిత్రం చెప్పే విశేషాలు

(29-03-2024/2)

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా కావలిలో ‘ప్రజాగళం’ ప్రచారయాత్ర నిర్వహించారు. చంద్రబాబు హాజరై మాట్లాడారు.

 బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాల గూర్చి ఆయనతో చర్చించారు. 

దుబాయిలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో సినీ హీరో అల్లుఅర్జున్‌ మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాన్ని స్వయంగా అల్లు అర్జున్ గురువారం ఆవిష్కరించారు.

ఉండవల్లిలో తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నారా భువనేశ్వరి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 కోనసీమ జిల్లా కాకినాడ తీరంలో ఇండో-అమెరికా నావికాదళ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నావికాదళ సిబ్బంది వివిధ రకాల యుద్ధ నౌకలతో సముద్రంలో ప్రయాణించారు.  

 సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 

గుడ్‌ఫ్రైడే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో క్రైస్తవులు ప్రదర్శనలు నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

హీరో విశ్వక్‌సేన్‌ పుట్టినరోజు సందర్భంగా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రబృందం పోస్టర్‌ ఆధారంగా శుభాకాంక్షలు తెలిపింది.  

జిమ్‌.. జామ్‌..

చిత్రం చెప్పే విశేషాలు..(21-04-2024)

హైదరాబాద్‌ ఆటగాళ్ల సంబరాలు చూశారా!

Eenadu.net Home